Pilla raa song lyrics in telugu - మబ్బు లోన వాన విల్లులా

Pilla raa song lyrics in telugu - మబ్బు లోన వాన విల్లులా


Here in this post we shows the Pilla raa song lyrics in telugu language.Many people find it difficult for 
pilla ra lyrics in telugu from web.Here our readers can enjoy the pilla ra song lyrics in telugu.

Pilla raa song lyrics in telugu


Movie-RX 100

Directed by-Ajay Bhupathi

Produced by-Ashok Reddy Gummakonda

Written by-Ajay Bhupathi (Story) Tajuddin Syed (Dialogues)

Starring -Kartikeya Gummakonda-Payal Rajput

Music by-Chaitan Bharadwaj (Music)-Smaran (Background score)

Cinematography-Ram Reddy

Edited by-Praveen K. L.

Running time-153 minutes

Country-India

Language-Telugu


Pilla raa lyrics


మబ్బు లోన వాన విల్లులా | మట్టి లోన నీటి జల్లులా
గుండె లోన ప్రేమ ముల్లులా | దాగినావుగా
అందమైన ఆశ తీరక | కాల్చుతోంది కొంటె కోరిక
ప్రేమ పిచ్చి పెంచడానికా | చంపడానికా
కోరుకున్న ప్రేయసివే | దూరమైన ఊర్వశివే
జాలి లేని రాక్షసివే | గుండెలోని నా కసివే
చేప కళ్ళ రూపసివే | చిత్రమైన తాపసివే
చీకటింట నా శశివే | సరసకు చెలీ చెలీ రా...
ఎలా విడిచి బతకనే పిల్లా రా | నువ్వే కనపడవా కళ్లారా
నిన్నే తలచి తలచిలా వున్నాగా  | నువ్వే యద సడివే అన్నాగా
ఎలా విడిచి బతకనే పిల్లా రా | నువ్వే కనపడవా కళ్లారా
నిన్నే తలచి తలచిలా వున్నాగా | నువ్వే యద సడివే ...
మబ్బులోన వాన విల్లులా | మట్టి లోన నీటి జల్లులా
గుండె లోన ప్రేమ ముల్లులా | దాగినావుగా
అందమైన ఆశ తీరక | కాల్చుతోంది కొంటె కోరిక
ప్రేమ పిచ్చి పెంచడానికా | చంపడానికా

చిన్నాదానా | ఓసి అందాల మైనా
మాయగా మనసు జారి పడిపోయెనే తపనతో
నీ వెంటే తిరిగెనే | నీ పేరే పలికెనే | నీ లాగే కులికెనే | నిన్ను చేరగా
ఎన్నాళ్లయినా | అవి ఎన్నేళ్లు అయినా | వందేళ్లు అయినా
వేచి వుంటాను నిన్ను చూడగ
గండాలైనా | సుడి గుండాలు అయినా | వుంటానిలా | నేను నీకే తోడుగా
ఓ ప్రేమా | మనం కలసి ఒకటిగా ఉందామా
ఇదో ఎడతెగని హంగామా
ఎలా విడిచి బతకనే పిల్లా రా | నువ్వే కనపడవా

అయ్యో రామా | ఓసి వయ్యారి భామ
నీవొక మరపు రాని మృదు భావమే
కిల కిల నీ నవ్వు తళుకులే | నీ కళ్ళ మెరుపులే | కవ్విస్తూ కనపడే | గుండె లోతులో
ఏం చేస్తున్నా | నేను యే చోట వున్నా | చూస్తూనే వున్నా
కోటి స్వప్నాల ప్రేమ రూపము
గుండె కోసి | నిన్ను అందులో దాచి | పూజించనా | రక్త మందారాలతో
కాలాన్నే | మనం తిరిగి వెనకకే  తోద్దామా
మళ్ళీ మన కధనే రాద్దామా
ఎలా విడిచి బతకనే పిల్లా రా | నువ్వే కనపడవా





Hope you all enjoy Pilla raa song lyrics in telugu.

Comments

Popular posts from this blog

Onapattin thalam thullum lyrics in malayalam - ഓണപ്പാട്ടിൻ താളം തുള്ളും തുമ്പപ്പൂവേ

വസീഗരാ എൻ നെഞ്ചിനിക്ക - Vaseegara Song Lyrics in Malayalam

ಶ್ರೀ ವಿಷ್ಣು ಸಹಸ್ರ ನಾಮ ಸ್ತೋತ್ರಂ - Vishnu sahasranamam lyrics in kannada