Nee choopule song lyrics in telugu - నీ చూపులే నా ఊపిరీ ఓ సారిలా చూడే చెలి
Nee choopule song lyrics in telugu - నీ చూపులే నా ఊపిరీ ఓ సారిలా చూడే చెలి
Here we given the hit song Nee choopule song lyrics in telugu language.Hope all our readers go through the lyrics of Nee choopule song.
Movie - Endukante Premanta
Directed by-A. Karunakaran
Produced by-Sravanthi Ravi Kishore
Written by-A. Karunakaran
Starring -Ram-Tamannaah-Richard Rishi-Suman-Sayaji Shinde-Anu Hassan-Kona
Venkat
Music by-G. V. Prakash Kumar
Cinematography-I. Andrew
Production-company-Sri Sravanthi
Movies
Distributed by-14 Reels
Entertainment
Release date-8 June 2012
Running time-155 minutes
Nee choopule naa oopiri song lyrics in telugu
నీ చూపులే నా ఊపిరీ ఓ సారిలా చూడే చెలి
అమవాస్యనై ఉన్నా మరి అందించవే దీపావళి
ఎందుకె చెలియా రెప్పల వలలో వొదిగిన కలల..
కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెల..
నయనం హృదయం నీవే నీవై
సమయం వెనుకే చేసా పయనం
తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరాపన.
రోజూ కొత్తగా నీ సందర్శనం ఆహా అన్నదే నాలో స్పందనం
నిత్యం నువ్విలా నాకై చూడటం ఎంతో వింతగా ఉందీ అనుభవం
నడి వేసవిలో మరిగిస్తూనే మురిపిస్తుందే నీ చల్లదనం
ఎద మంటంతా దాచేస్తూ వెన్నెలయిందే ప్రేమ గుణం
నీకై వేచే నిట్టూర్పులే తూరుపు కానీ
నీ తలపులలో తలమునకలవని ఎన్నో జన్మలనీ
నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం
తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపన.
నీతో బంధమే రాసిందెవ్వరో నిన్నే నాకిలా చూపిందెవ్వరో
నన్నీ వైపుగా లాగిందెవ్వరో నిన్నే చూడగా ఆపిందెవ్వరో
దరదాపుల్లో పడిగాపుల్లో పడినిలిచా నీ రహదారుల్లో
తొలి వెలుగల్లే వస్తాలే కలిసే రేపటి పొద్దుల్లో
నీ చూపులే నా ఊపిరీ.. ఓ సారి ఇలా చూడే చెలి
అమవాస్యనై ఉన్నా మరి.. అందించవే దీపావళి
ఎందుకె చెలియా రెప్పల వలలో వొదిగిన కలల.
కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెల.
నయనం హృదయం నీవే నీవై
సమయం వెనుకే చేసా పయనం
తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరాపన.
Comments
Post a Comment